రెండు నెల‌ల క్రితం ప్రేమ వివాహం.. అంత‌లోనే వివాహిత అనుమానాస్ప‌ద మృతి

Married woman dies in suspicious manner in Kuppam.పెళ్లై మూడు నెల‌లు కూడా కాక‌ముందే గురువారం వివాహిత అనుమానాస్ప‌ద స్థితి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2022 10:00 AM IST
రెండు నెల‌ల క్రితం ప్రేమ వివాహం.. అంత‌లోనే వివాహిత అనుమానాస్ప‌ద మృతి

వారిద్ద‌రు ప్రేమించుకున్నారు. త‌మ ప్రేమ‌ను పెద్ద‌ల‌కు చెప్పి వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే.. ఏం జ‌రిగిందో తెలీదు గానీ పెళ్లై మూడు నెల‌లు కూడా కాక‌ముందే గురువారం వివాహిత అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌న కుప్పం ప‌ట్ట‌ణంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలాఉన్నాయి. పాతపేట‌కు చెందిన రోహిత్‌, భువ‌నేశ్వ‌రి(25) లు రెండు నెల‌ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్ద‌ల అంగీకారంతో రోహిత్ కుమార్ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. గురువారం మ‌ధ్యాహ్నాం వ‌ర‌కు భ‌వ‌నేశ్వ‌రి ఆనందంగానే క‌నిపించింది. అయితే.. ఏం జ‌రిగిందో తెలీదు గానీ ఇంటి మిద్దెపై ఉన్న గ‌దిలో ఉరికి వేలాడుతున్న స్థితిలో క‌నిపించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కుప్పం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా.. త‌మ కుమారైను భ‌ర్త‌,అత‌డి కుటుంబ స‌భ్యులే హ‌త‌మార్చారు అని మృతురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story