దారుణం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత
Married Woman cuts her boyfriend mysterious Ambedkar Konaseema District.ముందుగానే సిద్దంగా ఉంచుకున్న బ్లేడుతో అతడి
By తోట వంశీ కుమార్
తన భర్త ఇంట్లో లేడని ప్రియుడికి కబురు పంపింది. అతడు ఆగమేఘాల మీద ఆమె ఇంటికి వచ్చాడు. మంచి రసపట్టులో ఉండగా మరో మహిళతో అతడికి సంబంధం ఉందని ఆమె గొడవకు దిగింది. ముందుగానే సిద్దంగా ఉంచుకున్న బ్లేడుతో అతడి మర్మాంగంపై దాడి చేసింది. రక్తపు మడుగులో అతడు కొట్టు మిట్టాడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజోలు మండలం తాటిపాక ప్రాంతంతో ఓ వివాహిత తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. కొన్నాళ్లు భర్తతో బుద్దిగానే కాపురం చేసినా పరాయి మగాడిపై ఆమె మనసు పడింది. స్థానికంగా ఉంటున్న ఓ పెళ్లైన పురుషుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని భర్తకు తెలియకుండా చాలా గుట్టుగా సాగిస్తోంది. ఈ నెల 17న భర్త పనిపై బయటకు వెళ్లగా వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది.
ప్రియురాలు పిలవడంతో అతడు వెంటనే ఆమె ఇంటికి వెళ్లాడు. సన్నిహితంగా ఉన్న సమయంలో ప్రియుడితో వివాదం తలెత్తింది. మరో మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని ఆగ్రహించింది. అంతే అప్పటికే ఆమె సిద్దంగా ఉంచుకున్న బ్లేడ్‌తో అతడి మర్మాంగాన్ని కోసేసింది. రక్తపు మడుగులో అతడు కొట్టుమిట్టాడాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.