భర్తకు వేరే అమ్మాయి నుంచి ఆ మెసేజ్‌లు.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

Married woman commits suicide over husband's illicit affair in Guntur. ఏపీలో విషాద ఘటన జరిగింది. గుంటూరు నగర పరిధిలోని నవులూరులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ పోలీసులు

By అంజి
Published on : 26 Oct 2022 3:09 PM IST

భర్తకు వేరే అమ్మాయి నుంచి ఆ మెసేజ్‌లు.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

ఏపీలో విషాద ఘటన జరిగింది. గుంటూరు నగర పరిధిలోని నవులూరులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవులూరుకు చెందిన బర్ల చంద్రమ్మ(40)కి వసంత్ కుమార్ తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వసంత్ కుమార్ స్థానికంగా ఉన్న ఓ మహిళతో గత కొన్నేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఓ మహిళ ఫోన్ నుంచి వసంత్ కుమార్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.

అది చూసిన చంద్రమ్మ భర్తతో వాగ్వాదానికి దిగింది. ఆ మహిళతో ఇంకెప్పుడూ సన్నిహితంగా ఉండబోనని భర్త చెప్పడంతో వివాదం ముగిసింది. అయితే మనస్తాపం చెందిన చంద్రమ్మ సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాత్ రూమ్ లోకి వెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అదే రోజు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story