చిత్తూరులో వివాహిత దారుణ హత్య.. భర్తపై అనుమానం

Married woman brutally murdered in Chittoor, parents suspect husband. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లె పంచాయతీ మల్లేరులో ఆదివారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది.

By అంజి  Published on  31 Oct 2022 8:33 AM GMT
చిత్తూరులో వివాహిత దారుణ హత్య.. భర్తపై అనుమానం

చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లె పంచాయతీ మల్లేరులో ఆదివారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన యాదగిరికి రోజాతో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వారికి పిల్లలు లేరు. అయితే భార్య రోజా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నగల కోసం ఆమెను హత్య చేశారని భర్త యాదగిరి గ్రామస్తులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డీఎస్పీ గంగయ్య, సీఐ అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు డాగ్‌స్కాడ్‌ను రప్పించి విచారణ చేపట్టారు.

అయితే పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఇంతలో మృతురాలి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తమ బిడ్డను యాదిగిరి హత్య చేశారని ఆరోపిస్తూ దాడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. హత్య జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని డీఎస్పీ తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది సమక్షంలో మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story