వివాహేతర సంబంధం.. హోటల్ రూమ్ నంబర్ 107లో ఉక్కిరి బిక్కిరి చేసి..

Married man smothers girlfriend to death. కేరళ రాష్ట్రంలోని పరవూరుకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి.. తంపనూరు సమీపంలోని హోటల్ గదిలో తన ప్రియురాలిని పొట్టనబెట్టుకుని

By అంజి  Published on  9 March 2022 3:15 AM GMT
వివాహేతర సంబంధం.. హోటల్ రూమ్ నంబర్ 107లో ఉక్కిరి బిక్కిరి చేసి..

కేరళ రాష్ట్రంలోని పరవూరుకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి.. తంపనూరు సమీపంలోని హోటల్ గదిలో తన ప్రియురాలిని పొట్టనబెట్టుకుని హత్య చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. శనివారం హోటల్ రూమ్ నంబర్ 107లో మహిళ శవమై కనిపించింది. ఓ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. నిందితుడు ప్రవీణ్‌గా గుర్తించబడ్డాడు. అతనికి అప్పటికే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే నగరంలోని ఓ నగల దుకాణంలో తనతో పాటు పనిచేసే కట్టక్కడ సమీపంలోని వీరనకావుకు చెందిన గాయత్రి(24)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ప్రవీణ్ భార్యకు ఈ సంబంధం గురించి తెలియడంతో.. ఆమె జ్యూయలరీ షాప్ నిర్వాహకులతో పాటు గాయత్రి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. దీంతో గాయత్రి ఉద్యోగం వదిలివేయవలసి వచ్చింది. ఇంతలో ప్రవీణ్ తమిళనాడుకు బదిలీ అయ్యారు. మరోవైపు ప్రవీణ్ కూడా తన భార్యతో దూరం పాటిస్తున్నాడు. గత రెండు నెలలుగా ఆమెను కలవలేదు. గాయత్రి, ప్రవీణ్ ఇద్దరూ హోటల్ రూమ్ నంబర్ 107లో ఒకరినొకరు కలుసుకున్నారని, ఆ తర్వాత మహిళను ఉక్కిరి బిక్కిరి చేసి చంపాడని తంపనూర్ పోలీసులు తెలిపారు. అయితే, అర్ధరాత్రి ప్రవీణ్ ఒంటరిగా గది నుండి వెళ్లిపోయాడు. అనుమానం రాకుండా ఉండేందుకు అతనే స్వయంగా హోటల్ రిసెప్షన్‌కు ఫోన్ చేసి.. మృతి విషయాన్ని తెలియజేసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

Next Story
Share it