నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో కనిపించారు. తన భార్యతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు. మంచు కుటుంబంలో విబేధాలు నెలకొన్నాయంటూ ఓ వైపు ప్రచారం జరుగుతూ ఉండగా.. మంచు మనోజ్ ఇప్పుడు ఆసుపత్రిలో కనిపించడం షాకింగ్ గా అనిపించింది. మనోజ్ బంజారాహిల్స్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు.
మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయని, మనోజ్ పై దాడి జరిగిందని సాగుతున్న ప్రచారాన్ని మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది. ఈ వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఆపాలని కోరింది. మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారని కొన్ని మీడియా సంస్థలు కథనాలను కూడా ప్రసారం చేశాయి.