Mancherial: విద్యార్థి నాయకుడి లైంగిక వేధింపులు.. యువతి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఓ రాజకీయ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు వినయ్ కుమార్ వేధింపులకు తాళలేక 22 ఏళ్ల యువతి ఆత్మహ
By అంజి Published on 21 March 2023 11:01 AM ISTMancherial: విద్యార్థి నాయకుడి లైంగిక వేధింపులు.. యువతి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఓ రాజకీయ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు నలిమెల వినయ్ కుమార్ వేధింపులకు తాళలేక 22 ఏళ్ల యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని, ఆ తర్వాత నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని ఫోన్‌లో ఒత్తిడి చేయడం ప్రారంభించాడని, దీంతో ఆమె ఈ తీవ్ర చర్య తీసుకుందని పోలీసులు తెలిపారు.
ఆ యువతి ఏడాది క్రితం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అయినా యువకుడు వేధింపులకు గురి చేశాడు. వేధింపులు తాళలేక తన ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తొలుత స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించి తదుపరి చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.
మార్చి 13న ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లికి ప్లాన్ చేసినట్లు అమ్మాయి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలుసుకున్న అతను ఆమెను ఫోన్‌లో వేధించడం, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం ప్రారంభించాడు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ కుమార్‌పై లైంగిక వేధింపులతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలు మోపారు పోలీసులు.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.