రోడ్డుపై వెళ్తున్న మహిళలపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్
ఇటీవలి కాలంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
By అంజి Published on 1 Oct 2023 12:26 PM ISTరోడ్డుపై వెళ్తున్న మహిళలపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్
ఇటీవలి కాలంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో వక్రబుద్ధిగల వారి బెడద రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలో ప్రతిరోజూ మహిళలపై లైంగిక వేధింపులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులోని వసంత్‌నగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒంటరిగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసిన ఓ వక్రబుద్ధి వ్యక్తి.. అమ్మాయిలను కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఉదయం కాలేజీకి వెళ్తున్న బాలికలను వెంబడించి వీపుపై కొట్టి కౌగిలించుకుని ముద్దులు పెట్టి పరారయ్యాడు నిందితుడు. వసంత్ నగర్ పీజీలో ఎంబీఏ చదువుతున్న వేరే ప్రాంతానికి చెందిన యువతిని రోజూ ఓ వ్యక్తి వెంబడించి వేధించేవాడు.
బాధితుల్లో ఒకరు నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో, అతని గురించిన వివరణ ఆధారంగా పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అతన్ని అరెస్టు చేయడంతో నేరం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఏకాంత ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా యువతిపై వేధింపులకు గల కారణాలు వెల్లడయ్యాయి. ప్రేమించాలనే ఉద్దేశంతో యువతికి నచ్చజెప్పి తిరిగొచ్చేవాడని పోలీసుల విచారణలో నిందితుడు చెప్పినట్లు సమాచారం. నిందితుడు అయ్యప్ప వృత్తిరీత్యా మెకానిక్. ఇప్పుడు అతడిని అరెస్ట్ చేసిన హైగ్రౌండ్ స్టేషన్ పోలీసులు జైలుకు పంపారు. ఇటీవలి రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.