యువ‌కుడి దారుణ హ‌త్య‌.. మంగ‌ళూరులో 144 సెక్షన్‌ విధింపు

Man Stabbed Outside Mangaluru Shop By Masked Attacker.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో గురువారం రాత్రి ఓ వ్యక్తిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2022 9:24 AM IST
యువ‌కుడి దారుణ హ‌త్య‌.. మంగ‌ళూరులో 144 సెక్షన్‌ విధింపు

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో గురువారం రాత్రి ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు క‌త్తితో దాడి చేసి హ‌త‌మార్చిన‌ట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. మంగళవారం రాత్రి జిల్లాలోని బెల్లారెలో బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్యకు గురైన నేపథ్యంలో ఈ హత్య చోటు చేసుకున్న‌ట్లు బావిస్తున్నారు.

ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టారు కుటుంబ స‌భ్యుల‌ను క‌ర్ణాట‌క సీఎం ప‌రామ‌ర్శిస్తున్న స‌మ‌యంలోనే ఈ హ‌త్య జ‌రిగింది. మంగ‌ళూరు శివార్‌లోని సూర‌త్ క‌ల్ ప్రాంతంలోని ఓ వ‌స్త్ర దుకాణం ఎదుట ఈ దాడి జ‌రిగింది. దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఫాజిల్‌(23) ను ఆస‌త్రికి త‌ర‌లించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. దాడి జరిగిన కొద్దిసేపటికే సూరత్‌కల్ మరియు పరిసర ప్రాంతాలలో 144 సెక్ష‌న్ విధించారు.

"ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం. అందువల్ల, సూరత్‌కల్‌లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించబడ్డాయి "అని మంగళూరులోని పోలీసు చీఫ్ శశికుమార్ తెలిపారు. మంగ‌ళూరు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని అన్ని మ‌ద్యం దుకాణాల‌ను జూలై 29 వ‌ర‌కు మూసివేశారు. ప్ర‌తీ ప్రాంతంలో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. శాంత్రి భ‌ద్ర‌త‌ల కార‌ణంగా ముస్లిం నాయ‌కులు, ముస్లింలు అంతా త‌మ ఇళ్ల‌లోనే ఉండి ప్రార్థ‌న చేసుకోవాల‌ని కోరారు. ఫాజిల్ హ‌త్య వెనుక ఉన్న నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌న్నారు. ఎలాంటి పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.

Next Story