దారుణం.. ఆస్ప‌త్రిలో పెట్రోల్ పోసి రోగికి నిప్పంటించాడు

Man Set On Fire In Hospital By Attacker.ఆ ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రిగింది. ఓ వ్య‌క్తికి గాయం కాగా.. చికిత్స

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 6:31 AM GMT
దారుణం.. ఆస్ప‌త్రిలో పెట్రోల్ పోసి రోగికి నిప్పంటించాడు

ఆ ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రిగింది. ఓ వ్య‌క్తికి గాయం కాగా.. చికిత్స చేయించుకునేందుకు ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. కొద్ది సేప‌టి త‌రువాత మ‌రో వ్య‌క్తి ఆస్ప‌త్రికి వ‌చ్చి.. త‌న‌తో గొడ‌వ ప‌డిన వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలో జూన్ 10న జ‌రుగ‌గా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన మొత్తం దృశ్యాలు ఆస్ప‌త్రిలోని సీసీ కెమెరాలో న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం బాదితుడు కాలిన గాయాల‌తో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. దామోదర్‌ కోరి, మిలన్ మాచే రజాక్‌ మధ్య జూన్ 10న‌(గురువారం) ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ గొడ‌వ‌లో దామోద‌ర్ కోరికి గాయాలు అయ్యాయి. దీంతో అత‌డు చికిత్స చేయించుకునేందుకు బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ ఆస్ప‌త్రికి వచ్చాడు. అయితే తనతో గొడవపడిన కోరిపై ఆగ్రహంతో ఉన్న మిలన్‌ మాచే కొన్ని గంటల తర్వాత కోరి ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. చికిత్స చేయించుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్న దామోద‌ర్ కోరిపై మిలన్‌ మాచే పెట్రోల్ పోసి త‌న వ‌ద్ద ఉన్న లైట‌ర్‌తో నిప్పంటించాడు. అనంత‌రం అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో దామోద‌ర్ మోరి శ‌రీరం 50 శాతం కాలిపోయింది. అత‌డిని వెంట‌నే ఆస్ప‌త్రిలోని ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న మొత్తం ఆస్ప‌త్రిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సీసీటీవీ, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసి నిందితుడు మిలన్ మాచే రజాక్‌ను అరెస్టు చేశారు.

Next Story
Share it