వాయిస్ మార్చి మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటచేసుకుంది. ఒక వ్యక్తి యాప్‌ను ఉపయోగించి విద్యార్థినులతో ఫొన్లో మాట్లాడాడు.
By Srikanth Gundamalla Published on 26 May 2024 5:18 AM GMTవాయిస్ మార్చి మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటచేసుకుంది. ఒక వ్యక్తి యాప్‌ను ఉపయోగించి విద్యార్థినులతో ఫొన్లో మాట్లాడాడు. వాయిస్ మార్చి మహిళా లెక్చరర్‌ను అంటూ నమ్మించాడు. ఆ తర్వాత స్కాలర్‌షిప్ పని ఉందనీ.. కాలేజీకి రావాలని చెప్పాడు. దాంతో నమ్మిన పలువురు విద్యార్థులను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇదే తరహాలో మరో రెండు కేసులు కూడా నమోదు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిధి జిల్లాకు చెందిన బ్రజేశ్ ప్రజాపతికి 30 ఏళ్లు. అతను టెక్నాలజీని ఉపయోగించి ఓ యాప్ ద్వారా మహిళా లెక్చరర్‌గా విద్యార్థినులకు కాల్ చేశాడు. స్కాలర్ షిప్ పని ఉందనీ.. కొద్ది సేపట్లోనే అయిపోతుందనీ కాలేజీకి రావాలని చెప్పాడు. తాను తన కుమారుడిని పంపిస్తానని వచ్చి వెంటనే వెళ్లిపోవాలని లేడీ వాయిస్‌లో నమ్మించాడు. ఇక లెక్చరర్ అని నమ్మిన విద్యార్థులు అతను బైక్‌పై రావడంతో ఎక్కారు. ఆ తర్వాత వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు బ్రజేశ్ ప్రజాపతి. ఆ తర్వాత వారి వద్ద సెల్‌ఫోన్లు లాక్కుని పారిపోతున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిపై మొదటగా మే 16న ఓ బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత మరో ముగ్గురు కూడా కంప్లైంట్ చేశారని చెప్పారు.
అయితే బాధితురాళ్లు చెప్పిన వివరాలు మేరకు నిందితుడిని గుర్తించామని.. అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. విచారణలో నిందితుడిని ప్రశ్నించగా.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. అయితే.. ఏడుగురు కంటే ఎక్కువ మందే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్రజేశ్‌తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు నిందితులు లవ్‌కుశ్ ప్రజాపతి, రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరు వాట్సాప్ గ్రూప్‌ల నుంచి విద్యార్థినుల ఫోన్ నెంబర్లు తీసుకుని యాప్ ద్వారా వాయిస్ మార్చి మాట్లాడినట్లు పోలీసులు వెల్లడించారు.
అత్యాచార సంఘటనలను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారు సమాజానికి శత్రువులని చెప్పారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని అన్నారు. ఈ మేరకు తొమ్మిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు సిట్ విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.