దారుణం.. మ‌హిళ‌ను ట్రైన్ కింద తోసేసి.. పిల్ల‌ల‌తో ప‌రారైన వ్య‌క్తి

Man Pushes Woman Before Moving Train.ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఓ మ‌హిళ రైల్వే స్టేష‌న్ ఫ్లాట్‌ఫామ్ పై నిద్ర పోతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Aug 2022 2:01 PM IST
దారుణం.. మ‌హిళ‌ను ట్రైన్ కింద తోసేసి.. పిల్ల‌ల‌తో ప‌రారైన వ్య‌క్తి

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఓ మ‌హిళ రైల్వే స్టేష‌న్ ఫ్లాట్‌ఫామ్ పై నిద్ర పోతుంది. అంత‌లో అక్క‌డ‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఆమెను నిద్ర‌లేపాడు. ఏదో మాట్లాడుతూ వేగంగా లాక్కెళ్లి రైలు కింద తోసేశాడు. అనంత‌రం ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని అక్క‌డి నుంచి ప‌రారు అయ్యాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ముంబై స‌మీపంలోని వ‌సాయ్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు మొత్తం రైల్వే స్టేష‌న్‌లోని సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు చోటుచేసుకుంది. కాగా.. ఆదివారం మ‌ధ్యాహ్నాం నుంచి నిందితుడితో పాటు మృతురాలు, ఇద్ద‌రు పిల్ల‌లు వ‌సాయి రైల్వే స్టేష‌న్లోనే ఉన్నారు. రాత్రి అక్క‌డి బ‌ల్ల‌పై నిద్ర‌పోయారు.

ఈ క్ర‌మంలో తెల్ల‌వారుజామున బాధితురాలి వ‌ద్ద‌కు వచ్చిన వ్య‌క్తి ఆమెను నిద్ర‌లేపి.. ట్రైన్ వ‌స్తుండ‌గా లాక్కెళ్లి ప‌ట్టాల‌పై ప‌డేశాడు. అవాధ్ ఎక్స్‌ప్రెస్ ఆ మ‌హిళ‌పై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆ మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. నిద్ర‌మ‌త్తులో ఉన్న చిన్నారుల‌ను అలాగే లాక్కొని అక్క‌డి నుంచి పారిపోయాడు. అత‌డు తొలుత దాద‌ర్‌, అక్క‌డి నుంచి క‌ల‌యాణ్ కు వెళ్లినా.. భీవండిలో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మృతురాలు అత‌డి భార్య కావొచ్చున‌ని తెలుస్తోంది.

Next Story