దారుణం.. ఆవుపై అఘాయిత్యం.. ఉరిపడి మృతి

Man molested cow in Nirmal.కామాంధుల ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. కామంతో క‌ళ్లు మూసుకుపోయి వాయి వ‌రుస‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2022 4:40 AM GMT
దారుణం.. ఆవుపై అఘాయిత్యం.. ఉరిపడి మృతి

కామాంధుల ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. కామంతో క‌ళ్లు మూసుకుపోయి వాయి వ‌రుస‌లు మ‌రిచిపోతున్నారు. మ‌నుషులు, జంతువులు అనే తేడా లేకుండా అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువ‌కుడు ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆవు మెడ‌కు క‌ట్టిన తాడు.. ఉరిప‌డి ఆ మూగ జీవి మృతి చెందింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. నిర్మ‌ల్ జిల్లా పిప్రి గ్రామంలో ఓ రైతు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఆయ‌న ఇంట్లో మార్చుల్స్ వేసేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి కూలీల‌ను తీసుకువ‌చ్చాడు. ఆ కూలీల్లో విజ‌య్ అనే వ్య‌క్తి బుధ‌వారం అర్థ‌రాత్రి అంద‌రూ ప‌డుకున్న త‌రువాత రైతు పెరిటిలో క‌ట్టేసిన ఆవును కొత్త ఇంటికి తీసుకువ‌చ్చి కిటికీ ఊచ‌ల‌కు క‌ట్టేశాడు. అనంత‌రం ఆ మూగ జీవిపై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. పెనుగులాట‌లో ఊచ‌ల‌కు క‌ట్టిన తాడు మెడ‌కు ఉరిగా బిగిసుకుపోవ‌డంతో ఆవు మృతి చెందింది.

ఉద‌యం ఆవు పెర‌టిలో క‌నిపించ‌క‌పోవ‌డంతో రైతు అంతటా వెతుక‌క‌గా.. కొత్త ఇంటిలో మ‌ర‌ణించి ఉండ‌డాన్ని గ‌మ‌నించాడు. ఘ‌ట‌నాస్థ‌లంలో విజ‌య్ అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. విజ‌య్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా.. నిజం ఒప్పుకున్నాడు. ఆవు య‌జ‌మాని ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు ఎస్ ఐ సాయికుమార్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌ట్టామ‌ని, పోస్టుమార్టం నివేదిక రాగానే.. దాని ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

Next Story
Share it