అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని ఇటుకలతో కట్టి నదిలో విసిరేశాడు

గ్రేటర్‌ నోయిడా పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని అనుమానించిన భర్త

By అంజి
Published on : 5 April 2023 9:33 AM IST

Yamuna River, Crime news, Greater Noida

అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని ఇటుకలతో కట్టి నదిలో విసిరేశాడు

గ్రేటర్‌ నోయిడా పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని అనుమానించిన భర్త.. ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఇటుకలతో కట్టి సంచిలో వేసి యమునా నదిలో పడేశాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దంపతులు - శ్రవణ్, ఉష. ఇద్దరి వయస్సు 30 ఏళ్లు. వీరూ జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛతంగా ఖుర్ద్ గ్రామంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.

"సోమవారం శ్రవణ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదును నమోదు చేశాడు. అదే రోజు అలీఘర్‌లో నివసిస్తున్న ఉష కుటుంబ సభ్యులు.. ఉష శ్రవణ్‌చే చంపబడిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విచారణ కోసం శ్రవణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం, సోమవారం రాత్రి తన భార్యను గొంతుకోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. అతను మృతదేహాన్ని ఒక గోనె సంచిలో నింపి, యమునా నదిలో పడవేసే ముందు సంచిని కొన్ని ఇటుకలతో నింపాడు'' అని అధికారి చెప్పారు.

తదుపరి విచారణలో రోజువారీ వేతన జీవి శ్రవణ్ తమ గ్రామంలోని ఒక వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించినట్లు అధికారి తెలిపారు. శ్రవణ్‌పై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద మంగళవారం జేవార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం, మీరట్ నుండి వచ్చిన స్పెషలిస్ట్ డైవర్లు యమునా నది నుండి మృతదేహాన్ని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారని పోలీసులు తెలిపారు.

Next Story