మద్యం మత్తులో భర్త ఘాతుకం.. భార్యను నరికి.. తానూ నరుక్కొని
Man kills pregnant wife and commits suicide in Kamareddy District.చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పడమే ఆమె పాలిట
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2022 7:55 AM ISTచెడు అలవాట్లు మానుకోవాలని చెప్పడమే ఆమె పాలిట శాపమైంది. మద్యానికి బానిసైన భర్త.. ఐదు నెలల గర్భిణి అని చూడకుండా భార్యను విచక్షణారహితంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అతడు గొంతు కోసుకున్నాడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో సత్తవ్వ-నారాయణ దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సంజీవులు(29) ను చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. గాంధారి మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన రమ్య శ్రీ(24)తో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరికి మూడేళ్ల కూతురు సహశ్రీక సంతానం. కొంత కాలం పాటు వీరి సంసారం బాగానే సాగింది. మద్యానికి బానిసైన సంజీవులు ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు.
ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు మొదలు అయ్యాయి. దీంతో రమ్య శ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి తిరిగి తీసుకువచ్చారు. ప్రస్తుతం రమ్యశ్రీ ఆరు నెలల గర్భిణి. గురువారం ఉదయం తాగి వచ్చిన సంజీవులు మరోసారి రమ్య శ్రీతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సంజీవులు గొడ్డలితో రమ్యశ్రీ మెడపై నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
అనంతరం తన తలపైన నరుక్కున్నాడు. రక్తమోడుతున్నప్పటికి పొలం వద్ద ఉన్న తండ్రిని చంపేస్తానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. పొలం వైపు వెలుతూ కుప్పకూలిపోయాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంజీవులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.