ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు విజయనగరం జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులపై ట్రాక్టర్‌ను తోక్కించి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చల్లవానితోట పంచాయతీ నడుపూరి కల్లాలు గ్రామంలో నిన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కొడుకు పి. రాజశేఖర్ తన తల్లిదండ్రులు పి. అప్పల నాయుడు, పి. జయమ్మలను ట్రాక్టర్‌ను తోక్కించి చంపేశాడని విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వకుల్ జిందాల్ తెలిపారు.
"వారికి ఒక ఆస్తి (భూమి) ఉంది. కొడుకు దానిని అమ్మాలనుకున్నాడు. అతను అమ్మిన తర్వాత వచ్చిన దాంట్లో వాటా కోరుకున్నాడు. కానీ తండ్రి దానిని అతనితో పంచుకోవడానికి ఇష్టపడలేదు" అని జిందాల్ తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం.. రాజశేఖర్ భూమిని చదును చేయడానికి ఒక ఎక్స్‌కవేటర్‌ను తీసుకువచ్చాడు, కానీ అప్పలనాయుడు దానిని వెనక్కి పంపాడు, దీనితో అతని కుమారుడు ఆవేశానికి గురయ్యాడు. దీని తరువాత, రాజశేఖర్ తన తండ్రి , తల్లిపై ట్రాక్టర్‌తో తొక్కించి పారిపోయాడు. తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు రాజశేఖర్ కోసం వెతుకుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.