దారుణం.. రూ.10 కోసం గొడవ.. ఫ్రెండ్‌ను చంపిన యువకుడు
Man kills friend over Rs 10 in West Bengal. ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10 రూపాయల
By అంజి Published on 15 Dec 2022 5:11 PM ISTఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10 రూపాయల కోసం ఓ యువకుడు తన స్నేహితుడిని బండరాయితో కొట్టి చంపాడు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాంప్రసాద్ సాహా మృతదేహం బైకుంతపూర్ అడవుల్లో లభ్యమైనట్లు వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిలిగురికి చెందిన రాంప్రసాద్ సాహా, సుబత్రా దాస్ స్నేహితులు. వీరిద్దరూ మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. మత్త పదార్థాల కోసం తరచూ అడువుల్లోకి వెళ్లేవారు. పోలీసుల విచారణలో.. రాంప్రసాద్ సాహా వ్యసనపరుడని, మాదకద్రవ్యాల దుర్వినియోగం కోసం అతని అవసరాలను తీర్చుకోవడానికి క్రమం తప్పకుండా అడవికి వెళ్లేవాడని తేలిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అతను తన స్నేహితులు సుబ్రతా దాస్ (22), అజయ్ రాయ్ (24)తో కలిసి సోమవారం అడవికి వెళ్లాడు. వీరంతా మత్తుకు బానిసలయ్యారు.
తీరా అక్కడి వెళ్లాక రాంప్రసాద్ సాహా తన వద్ద డబ్బు లేదని గుర్తించి, మరిన్ని మత్తుపదార్థాలు కొనడానికి సుబ్రతను రూ. 10 అడిగాడు. వెంటనే గొడవ జరిగి సుబ్రత అతడిని రాయితో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. సిలిగురి మెట్రో పోలీస్‌లోని అషిఘర్ ఔట్‌పోస్ట్ అధికారులు బుధవారం రాత్రి సుబ్రత, అజయ్‌లను అరెస్టు చేశారు, ఆ తర్వాత కేసును ఛేదించినట్లు వారు తెలిపారు. మొత్తం ఎపిసోడ్‌లో అజయ్ పాత్రను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.