పెళ్లైన ఐదు నెల‌ల‌కే.. స‌హోద్యోగితో ఎఫైర్‌.. భార్య‌కు ఇంజెక్ష‌న్లు ఇచ్చి

Man killed wife due to his extramarital affair in Pune.పెళ్లి అయిన ఐదు నెల‌ల‌కే భార్యను హ‌త్య చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2022 8:31 AM GMT
పెళ్లైన ఐదు నెల‌ల‌కే.. స‌హోద్యోగితో ఎఫైర్‌.. భార్య‌కు ఇంజెక్ష‌న్లు ఇచ్చి

వివాహేత‌ర సంబంధాలు ప‌చ్చ‌ని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. ఈ అనైతిక బంధాల మోజులో ప‌డి దంప‌తులు చేజేతులా త‌మ సంసారాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. త‌మ భాగ‌స్వాముల‌ను అంత‌మొందించేందుకు ఏ మాత్రం వెనుకాడం లేదు. జీవితాంతం అండ‌గా నిలుస్తాన‌ని మాట ఇచ్చిన భ‌ర్త ప‌రాయి స్త్రీ మోజులో ప‌డి పెళ్లి అయిన ఐదు నెల‌ల‌కే ఆమెను హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్వ‌ప్నిల్ సావంత్ అనే 23 ఏళ్ల యువ‌కుడు పుణెలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో వార్డు బాయ్‌గా ప‌ని చేస్తున్నాడు. ప్రియాంక అనే మ‌హిళ‌ను ఐదు నెల‌ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ జంట ముల్షి తహసీల్‌లోని కాసర్ అంబోలి గ్రామంలో నివ‌సిస్తోంది. అయితే.. సావంత్ తాను ప‌నిచేసే చోట స‌హోద్యోగితో ఎఫైర్ న‌డుపుతున్నాడు. ఈ క్ర‌మంలో ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని బావించాడు. అయితే.. అందుకు త‌న భార్య అడ్డుగా ఉంద‌ని, ఆమెను అడ్డు తొల‌గించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ప‌థ‌కం ప్ర‌కారం న‌వంబ‌ర్ 14న భార్య‌కు ప్రాణాంత‌క‌మైన ఇంజెక్ష‌న్ ఇచ్చి హ‌త్య చేశాడు. అయితే.. ఎవ‌రికి అనుమానం రాకుండా ఉండేందుకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భార్య‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాడు. ఆమెను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు అప్ప‌టికే ఆమె చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని అంద‌రిని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న భార్య రాసిన‌ట్లుగా ఓ సూసైడ్ నోట్ రాశాడు.

అయితే.. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు విష‌యం చెప్పేశాడు. అత‌డు తాను ప‌ని చేస్తున్న ఆస్ప‌త్రి నుంచి వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్, లోక్స్ 2 శాతంతో సహా కొన్ని మందులు దొంగిలించిన‌ట్లు తెలిసింది. వాటి సాయంతో భార్య‌ను హ‌త్య చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story
Share it