రొంపిచర్లలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం

Man killed old woman in Rompicherla.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2022 11:34 AM IST
రొంపిచర్లలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ప‌సికందుల నుంచి కాటికి కాలు చాపిన ముస‌లి వాళ్ల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు కామాంధులు. ప‌ల్నాడులోని రొంపిచ‌ర్ల‌లో దారుణం జ‌రిగింది. ఓ వృద్ధురాలు అత్యాచారంతో పాటు హ‌త్య‌కు గురైంది.

విప్ప‌ర్ల గ్రామంలో రోజు మాదిరిగానే శుక్ర‌వారం రాత్రి ఓ వృద్దురాలు(65) ఇంటి ముందు నిద్ర‌పోయింది. శ‌నివారం తెల్ల‌వారి చాలాసేపు అయిన‌ప్ప‌టికి ఎంత‌కీ ఆమె నిద్ర‌లేవ‌క‌పోవ‌డంతో వెళ్లి లేపేందుకు య‌త్నించ‌గా మృతి చెందిన‌ట్లు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు పోలీసులు.

మృతురాలి శ‌రీరంపై గాయాలు ఉండ‌డంతో పాటు దుస్తులు తొల‌గించి ఉండ‌డంతో అత్యాచారం చేసి హ‌త్య చేసి ఉండొచ్చున‌ని అనుమానంతో డాగ్ స్వ్కాడ్ ను ర‌ప్పించారు. శున‌కాలు ఓ ఇంటికి వెళ్లి ఆగిపోయాయి. ఆ ఇంట్లో ఉంటున్న పెర‌వ‌ళి మ‌ణికంఠ‌(27) అదుపులోకి తీసుకుని విచారించ‌గా అత్యాచారం చేసి హ‌త్య చేసిన‌ట్లు చెప్పాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story