'ముందుగా చనిపోతారో అని పందెం'.. ఆ తర్వాత ఫ్రెండ్‌ని చంపి

Man killed his friend by pushing him on a train in hariyana. వింటేనే చలించిపోయే ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. స్నేహితుడి హత్యకు సంబంధించిన

By అంజి  Published on  1 Dec 2022 6:04 PM IST
ముందుగా చనిపోతారో అని పందెం.. ఆ తర్వాత ఫ్రెండ్‌ని చంపి

వింటేనే చలించిపోయే ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. స్నేహితుడి హత్యకు సంబంధించిన సంచలన కేసు అసలు నిజం బయట పడింది. జిల్లాలోని జట్వారా గ్రామానికి చెందిన ముఖేష్, అతని స్నేహితుడు మను.. 'ఎవరు ముందుగా చనిపోతారో' అని పందెం కాశారు. ఆ తర్వాత ఇద్దరూ రైలు ట్రాక్‌పైకి వెళ్లి ప్రయత్నించారు. అయితే మను ముఖేష్‌ను రైలు ముందుకి నెట్టాడు. దీంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు మనును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ముఖేష్, మను ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఈ ఇద్దరూ నగరంలో దుప్పట్లు అమ్ముతూ జీవనం సాగించారు. వారు రాత్రి విపరీతంగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ముందుగా ఎవరు చనిపోతారని ఇద్దరూ పందెం వేసుకున్నారు. ఆ తర్వాత ముఖేష్‌ సోదరి ఇంట్లో భోజనం చేసి నేరుగా రైల్వే ట్రాక్‌ దగ్గరకు వెళ్లారు. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ముందుకి ముఖేష్‌ను మను నెట్టాడు. దీంతో ముఖేష్ మరణించాడు. మరోవైపు, ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సోనిపట్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

Next Story