మద్యానికి బానిస.. ఫ్లై ఓవర్ నుండి దూకి..
హైదరాబాద్ లో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఆ వ్యక్తి ప్రాణాలు
By అంజి Published on 6 Jun 2023 3:00 PM ISTమద్యానికి బానిస.. ఫ్లై ఓవర్ నుండి దూకి..
హైదరాబాద్ లో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఎస్ఆర్నగర్లోని బాపునగర్‌కు చెందిన భూక్యా అశోక్(36) మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. కొంతకాలం తర్వాత రుక్సానాబేగం అనే మహిళను పెండ్లి చేసుకున్నాడు. వెల్డింగ్ పనిచేసే అశోక్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యను వేధించేవాడు. చనిపోతానని బెదిరించేవాడు. సోమవారం ఉదయం 6 గంటలకే మద్యం తాగుడు మొదలుపెట్టిన అశోక్ భార్య రుక్సానా బేగంను కొట్టాడు.
ఆ తర్వాత చనిపోతానని చెప్పి మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు బాలానగర్ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్‌ను గాంధీకి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మద్యం మత్తులో అశోక్ ఫ్లైఓవర్ పైనుంచి దూకడం అందులో రికార్డయ్యింది.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.