వ్యక్తిని తలకిందులుగా వేలాడదీసి చితక్కొట్టారు.. వీడియో వైరల్‌

Man Hung Upside Down Brutally Thrashed In Mps Ujjain. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. తాలిబన్ల శిక్షల మాదిరిగా ఓ వ్యక్తిని తలకిందులుగా

By అంజి
Published on : 11 Nov 2022 8:21 PM IST

వ్యక్తిని తలకిందులుగా వేలాడదీసి చితక్కొట్టారు.. వీడియో వైరల్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. తాలిబన్ల శిక్షల మాదిరిగా ఓ వ్యక్తిని తలకిందులుగా వేలాడదీసి అతి క్రూరంగా కొట్టారు. ఈ ఘటన ఉజ్జయిని జిల్లాలో ఇంగోరియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సిజావత గ్రామానికి చెందిన అర్జున్‌ మోంగియా అనే వ్యక్తి.. ఓ యువకుడిని దారుణంగా కొట్టాడు. బోరు పైపులకు అతడిని తలకిందులుగా కట్టేసి వేలాడదీశాడు. ఆ తర్వాత కర్రతో యువకుడిని చితకబాదాడు. తన పొలంలోని కత్తిని దొంగిలించేందుకు అతడు ప్రయత్నించినట్లు అర్జున్‌ ఆరోపించాడు.

కాగా, ఈ నెల 4న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతను కనికరం కోసం వేడుకున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు కొట్టడం వీడియోలో కనిపించింది. దీంతో ఇది ఇంగోరియా పోలీసుల దృష్టిలో పడింది. దీనిని పరిశీలించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే ఈ సంఘటనపై బాధితుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. దాడి నేపథ్యంలో భయపడిన ఆ యవకుడు గ్రామం నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తుచేస్తున్నట్లు వెల్లడించారు.

వీడియో వైరల్ అయిన వెంటనే, ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతేంద్ర కుమార్ శుక్లా వివరణాత్మక దర్యాప్తు చేయవలసిందిగా స్టేషన్ ఇన్‌ఛార్జ్ పృథ్వీ సింగ్ ఖల్తాయ్‌ను ఆదేశించారు. అనుమానిత దొంగను ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు. వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అనాగరిక పద్ధతిలో శిక్షించారు.


Next Story