అప్పు కోసం వెళితే.. జూనియర్ ఆర్టిస్టుపై అఘాయిత్యం

Man harassment Junior Artist in Banjara Hills.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. నిత్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 7:36 AM IST
అప్పు కోసం వెళితే.. జూనియర్ ఆర్టిస్టుపై అఘాయిత్యం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. అప్పు కోసం వెళ్లిన ఓ యువ‌తిపై యువ‌కుడు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని ఇందిరానగర్‌లో ఓ యువ‌తి(22) నివ‌సిస్తోంది. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ జీవ‌నం సాగిస్తోంది. త‌న‌కు న‌గ‌దు అవ‌స‌రం కావ‌డంతో అప్పు కోసం స్నేహితుడైన బాలు నాయ‌క్‌ను అడిగింది. డ‌బ్బులు ఇస్తాన‌ని రూమ్‌లోకి పిలిచిన అత‌డు యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతేకాకుండా అక్క‌డే ఉన్న త‌న స్నేహితుడితో గ‌డిపితే రూ.5వేలు ఇస్తానంటూ చెప్పాడు.

వారి నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన బాధితురాలు త‌న బంధువుకు జ‌రిగిన విష‌యం ఫోన్ చేసి చెప్పింది. వాళ్లిద‌రూ క‌లిసి వెళ్లి అడిగేందుకు య‌త్నించ‌గా అప్ప‌టికే స‌ద‌రు నిందితుడు రూమ్‌కి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story