భార్య, ముగ్గురు కుమార్తెలను చంపి.. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి తన భార్యను, ముగ్గురు మైనర్ కుమార్తెలను చంపేశాడు.

By అంజి
Published on : 13 March 2023 7:45 AM IST

Madhyapradesh, Burhanpur district

భార్య, ముగ్గురు కుమార్తెలను చంపి.. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో పోలీసులు ఆదివారం ఒక వ్యక్తి, అతని భార్య, వారి ముగ్గురు మైనర్ పిల్లల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలూ పదేళ్ల లోపు వారే. ఈ దారుణ ఘటన నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్లీ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి తన భార్యను, ముగ్గురు మైనర్ కుమార్తెలను చంపేశాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే నేపానగర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి, గ్రామస్తులు ఇంటికి వెళ్లారు. 'మనోజ్ (35) తన 32 ఏళ్ల భార్య, 3 నుంచి 10 ఏళ్ల వయస్సులో ఉన్న ముగ్గురు కుమార్తెలను గొంతు కోసి, ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మనోజ్ మానసికంగా అస్వస్థతకు గురై ఉండవచ్చు అని బుర్హాన్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ కుమార్ లోధా చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

Next Story