ఫేసుబుక్‌లో ట్రాన్స్ జెండర్‌తో ప్రేమ‌.. పెళ్లి.. క‌ట్నం కోసం వేధింపులు

Man dowry harassment for a Transgender woman.వారిద్ద‌రికి ఫేసుబుక్‌లో ప‌రిచ‌యం అయింది. కొన్నాళ్ల‌కు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2021 11:25 AM GMT
ఫేసుబుక్‌లో ట్రాన్స్ జెండర్‌తో  ప్రేమ‌.. పెళ్లి.. క‌ట్నం కోసం వేధింపులు

వారిద్ద‌రికి ఫేసుబుక్‌లో ప‌రిచ‌యం అయింది. కొన్నాళ్ల‌కు.. అతడు ఆమెగా మారిన వ్యక్తి అని తెలిసింది. అయిన‌ప్ప‌టికి ప్రేమించాడు. పెళ్లింటే చేసుకుంటే నిన్నే చేసుకుంటాన‌ని వెంట‌ప‌డ్డాడు. ఇంట్లో పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ.. ఆ త‌రువాత నువ్వు నాకు వ‌ద్దంటూ వేధింపుల‌కు పాల్ప‌డ‌డంతో ఆ ట్రాన్స్‌జెండ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఏలూరు స‌త్రంపాడుకు చెందిన తారక్ అలియాస్ పండు అనే యువ‌కుడికి పేస్‌బుక్‌లో భూమి అనే యువ‌తి ప‌రిచ‌యం అయింది. ఈలోపు భూమి మ‌హిళ కాద‌ని.. ట్రాన్స్‌జెండ‌ర్ అని తెలిసింది. అయిన‌ప్ప‌టికి ప్రేమించాడు. ఇక జ‌న‌వ‌రి 2020లో పెద్ద‌ల‌ను ఒప్పించి ఆమెను పెళ్లిచేసుకున్నాడు. కొద్దికాలం బాగానే ఉన్నా.. త‌రువాత ఇద్దరి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. కుటుంబ స‌భ్యులు ఇద్ద‌రికీ స‌ర్దిచెప్పారు. కాగా.. అద‌న‌పు క‌ట్నం తేవాలంటూ.. త‌న‌తో ఉండేది లేదంటూ వేదింపుల‌కు గురిచేయ‌డం మొద‌లెట్టాడు. తారక్ పెట్టే టార్చ‌ర్ భ‌రించ‌లేక‌పోయిన భూమి ఇటీవ‌ల హైదారాబాద్ ఎల్బీన‌గ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు తారక్‌ను అరెస్ట్ చేశారు.


Next Story
Share it