మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహితపై అత్యాచారం చేసిన అనంతరం నిందితుడు బాధితురాలి ఫోన్‌లో మాట్లాడిన అశ్లీల ఆడియో క్లిప్‌లను, వీడియోలను ఆమె భర్తకు పంపించాడు. ఇది చూసిన భర్త మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపించారని పోలీసులు కేసు నమోదు చేశారు. జాల్నా జిల్లాలోని భోకర్దన్ తాలూకా రేణుకై పింపాల్‌గావ్ గ్రామంలో వివాహితపై అత్యాచారం జరిగింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. గజానన్ అశోక్ దేశ్‌ముఖ్, రవి దత్తాత్రేయ సప్కల్, గజానన్ దిలీప్ శిరసాత్, మరో ఇద్దరు మహిళలు బాధితురాలిని రవి దత్తాత్రేయ సప్కల్‌తో ఫోన్‌లో మాట్లాడాల్సిందిగా బలవంతం చేశారు. ఆతర్వాత బాధిత మహిళకు మత్తు మందు ఇచ్చి రవి దత్తాత్రేయ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అసభ్యకర ప్రయోగాలు చేసి మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశారు. తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం సమయంలో చేసిన అసభ్యకరమైన ధ్వనిని రికార్డ్ చేశారు.
అనంతరం బాధిత మహిళ, రవి దత్తాత్రేయ సప్కాల్‌ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్‌ను బాధిత మహిళ భర్తకు పంపించాడు. అది చూసి పరువు పోతుందనే భయంతో బాధితురాలి భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, అత్యాచారం, వేధింపులు తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.