Vikarabad : రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి

మృత్యువు ఎప్పుడు ఏ విధంగా మనిషిని చుట్టుముడుతుందో ఎవ్వరికీ తెలియదు.

By Kalasani Durgapraveen  Published on  17 Nov 2024 3:15 PM IST
Vikarabad : రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి

మృత్యువు ఎప్పుడు ఏ విధంగా మనిషిని చుట్టుముడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తులు కూడా క్ష‌ణ‌కాలంలో మృత్యువు బారిన ప‌డిన ఘ‌ట‌న‌లు త‌ర‌చుగా మనం చూస్తుంటాం. వికారాబాద్ జిల్లాలో ఓ విషాద‌ చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న సోమేశ్వర అనే వృద్ధుడు ఈరోజు మధ్యాహ్నం సమయంలో అన్నం వండుకొని తిందామని రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాడు.

విద్యుత్ స్టవ్‌పై పెట్టిన రైస్ కుక్కర్ కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా పేలింది. ఆ సమయంలో సోమేశ్వర అక్కడే ఉండడంతో ఆ పేలుడు దాటికి అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటట్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story