Kerala: ప్రైవేట్‌ పార్ట్‌లోకి గాలి కొట్టడంతో సహోద్యోగి మృతి

ఓ వలస కూలీ సరదా కోసం చేసిన పనికి.. తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.

By అంజి
Published on : 11 May 2023 11:00 AM IST

Crime news, Kerala, Migrant labour

Kerala: ప్రైవేట్‌ పార్ట్‌లోకి గాలి కొట్టడంతో సహోద్యోగి మృతి

ఓ వలస కూలీ సరదా కోసం చేసిన పనికి.. తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. అసోంకు చెందిన మింటూ, సిద్దార్థ్‌ పని కోసం కేరళకు వలస వచ్చారు. సిద్దార్‌ సరదాగా మింటూ ప్రైవేట్‌ పార్ట్‌ల్లోకి కంప్రెషర్‌ యంత్రాన్ని ఉపయోగించి గాలి కొట్టాడు. దీంతో మింటూ కడుపు ఒక్కసారిగా ఉబ్బింది. ఏమైందోనని భయపడిన సిద్దార్థ్‌.. మింటూను ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే మింటూ మరణించాడని వైద్యులు ధృవీకరించారు. తన స్నేహితుడు మింటూ హఠాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడని సిద్దార్థ్‌ వైద్యులకు చెప్పాడు.

పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు విచారణలో సిద్దార్థ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన సోమవారం పెరుంబవూరు సమీపంలో చోటుచేసుకుంది. వీరిద్దరూ ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నారు. మింటూ సమీపంలోని ఆసుపత్రిలో మరణించాడని, అస్సాంకు చెందిన సిద్ధార్థ్‌పై ఐపిసి సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 304 నేరపూరిత నరహత్యకు శిక్షను అందిస్తుంది. తదుపరి విచారణ నిమిత్తం సిద్ధార్థ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

Next Story