ప్రియురాలు, ఫ్రెండ్స్‌ మోసం చేశారంటూ.. ఫేస్‌బుక్‌లో లైవ్‌లో ఆత్మ‌హ‌త్య‌

Man commits Suicide on Facebook Live.ప్రేమించిన అమ్మాయి, న‌మ్మిన స్నేహితులు మోసం చేశార‌ని ఓ వ్య‌క్తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Aug 2021 6:15 AM GMT
ప్రియురాలు, ఫ్రెండ్స్‌ మోసం చేశారంటూ.. ఫేస్‌బుక్‌లో లైవ్‌లో ఆత్మ‌హ‌త్య‌

ప్రేమించిన అమ్మాయి, న‌మ్మిన స్నేహితులు మోసం చేశార‌ని ఓ వ్య‌క్తి ఫేసుబుక్ లైవ్ లో మాట్లాడి మ‌రీ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ఏపీలోని ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం(36) లారీ యజమాని. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయాడు. స్నేహితుడు వేణుగోపాల్‌తో క‌లిసి శనివారం ఉదయం వ‌నస్థలిపురం ఆటోసాయినగర్‌లోని వీఎంఆర్‌ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అనంత‌రం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించి గదిలోకి వెళ్లి పడుకున్నారు.

మ‌ర‌లా సాయంత్రం బార్ వ‌చ్చి మ‌ళ్లీ మ‌ద్యం తాగారు. ఆ స‌మ‌యంలో షేక్ బ్ర‌హ్మం.. గ‌దికి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి వెళ్లిపోయాడు. అనంత‌రం గ‌దిలోకి వ‌చ్చిన షేక్ బ్ర‌హ్మం.. ఫేస్‌బుక్ లైవ్‌ని ఆన్‌చేశాడు. తాను ప్రేమించి మోస‌పోయాయ‌ని, స్నేహితులు కూడా మోసం చేశార‌ని.. చ‌నిపోతున్నానంటూ సీలింగ్ ఫ్యాన్‌కు లుంగీతో ఉరివేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఇంటినుంచి తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్‌ చేసినా బ్రహ్మం లిఫ్ట్ చేయలేదు. ఎంత‌సేప‌టికి కూడా బ్ర‌హ్మం కింద‌కి రాక‌పోవ‌డంతో వేణుగోపాల్ కూడా చాలా సార్లు ఫోన్ చేశాడు.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్త‌క‌పోయేట‌ప్ప‌కి.. వేణుగోపాల్ గ‌ది ద‌గ్గరికి వెళ్లాడు. త‌లుపులు మూసి ఉండ‌డంతో కిటీకిలోంచి చూసే స‌రికి.. బ్ర‌హ్మం ఫ్యానుకు వేలాడుతూ క‌నిపించాడు. లాడ్జి సిబ్బంది సాయంతో గ‌ది త‌లుపులు తెరిచి చూడ‌గా.. అప్ప‌టికే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it