దారుణం.. ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి.. 18 రోజుల పాటు..
Man chops live-in partner into 35 pieces, disposes them off across city over 18 days. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య
By అంజి Published on 14 Nov 2022 12:34 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, 18 రోజుల పాటు మెహ్రౌలీ అటవీ ప్రాంతం సమీపంలో నగరం అంతటా పారవేస్తూ వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అఫ్తాబ్ అమీన్ పూనావాలాగా గుర్తించారు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ప్రియురాలు శ్రద్ధను బాయ్‌ఫ్రెండ్ హత్య చేశాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు నెలల క్రితం మే నెలలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ హత్య జరిగింది.
బాధితురాలి తల్లిదండ్రులు నవంబర్ 8న మెహ్రౌలీ పోలీసులకు తప్పిపోవడంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అధికారులు తెలిపిన ప్రకారం.. బాధితురాలు ముంబైలో మలాడ్ ప్రాంతంలోని కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఆమెకు ఆఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. బాధితురాలు కాలక్రమేణా అఫ్తాబ్‌తో సన్నిహితంగా మెలిగింది. డేటింగ్‌లో కొన్ని నెలలు, ఈ జంట ఢిల్లీకి వెళ్లి సహజీవనం చేయడం ప్రారంభించారు. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే తమ కుమార్తె లివ్-ఇన్ రిలేషన్‌షిప్ గురించి తెలుసుకుని, ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు శ్రద్ధ.. అఫ్తాబ్ తనను వివాహం చేసుకుంటాడనే ఆలోచనలో ఉంది. పెళ్లి చేసుకుని కలిసి ఉందామని ఆఫ్తాబ్‌ను ఒత్తిడి చేసింది. దీంతో ఈ విషయం ఇద్దరి మధ్య తరచూ గొడవలకు దారితీసింది.
ఈ క్రమంలోనే గొడవ సమయంలో శ్రద్ధ బిగ్గరగా అరవడంతో.. ఆమెను నిశ్శబద్దంగా ఉంచడానికి గొంతును నొక్కాడు. దీంతో ఊపిరాడక శ్రద్ధ మృతి చెందింది. అఫ్తాబ్ తాను చేసిన నేరాన్ని దాచడానికి, ఒక రంపాన్ని ఉపయోగించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, వాటిని 18 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారవేసాడు. ఢిల్లీలోని మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో అఫ్తాబ్ శ్రద్ధ మృతదేహాన్ని ఒక్కొక్కటిగా పారవేస్తూనే ఉన్నాడు. నిందితుడు ఆమె శరీర భాగాలను 18 రోజుల పాటు దుర్వాసన రాకుండా భద్రపరిచేందుకు పెద్ద ఫ్రిజ్‌ను కూడా కొనుగోలు చేశాడు. అఫ్తాబ్ ప్రతిరోజూ రాత్రి 2 గంటలకు అటవీ ప్రాంతంలో శరీర భాగాలను పారవేసేందుకు మెహ్రౌలీకి వెళ్లేవాడు.
యువతి కుటుంబ సభ్యులకు తన గురించి తెలిసేలా శ్రద్ధ క్రమం తప్పకుండా తన ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేది. కొన్ని రోజులుగా శ్రద్ధ ఫేస్‌బుక్‌లో ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో ఆమె కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె తండ్రి ఐదు నెలల క్రితం ఢిల్లీకి వెళ్లి తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌తో కలిసి తన కూతురు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. అయితే, అక్కడికి చేరుకోగానే, ఆ స్థలం తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన ఆమె తండ్రి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి ఐదు నెలల తర్వాత నిందితులను పట్టుకున్నారు. నిందితుడిని పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ పదేపదే అడుగుతుండగా, ఈ ఒత్తిడి కారణంగానే ఆమెను నిందితుడు హత్య చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి.