నగ్న ఫోటోలు తీసి.. స్వలింగ సంపర్కుడికి బెదిరింపులు

డేటింగ్ యాప్ లలో మొదలయ్యే పరిచయాలు ఊహించని పరిణామాలకు కారణమవుతూ ఉంటాయి.

By M.S.R  Published on  28 Dec 2024 11:23 AM IST
నగ్న ఫోటోలు తీసి.. స్వలింగ సంపర్కుడికి బెదిరింపులు

డేటింగ్ యాప్ లలో మొదలయ్యే పరిచయాలు ఊహించని పరిణామాలకు కారణమవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్వలింగ సంపర్కుడికి ఓ చేదు అనుభవం ఎదురైంది.

ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడికి డేటింగ్‌ యాప్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. డిసెంబర్ 23న తన ఫ్లాట్‌ కు రావాలని ఆహ్వానించాడు. అక్కడ కలుసుకున్న తర్వాత సదరు గుర్తు తెలియని వ్యక్తి నగ్నంగా ఫొటోలు తీశాడు. ఆ ఫోటోలతో బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.15,000లు ఇవ్వాలని బాధితుడిని బెదిరించడం మొదలుపెట్టాడు. తన వద్ద అంత లేవని రూ.10,000లను యూపీఐ పేమెంట్‌ ద్వారా చెల్లించి అక్కడి నుండి వచ్చేశాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తిపై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. షేక్‌పేట ప్రాంతంలో నివసించే తనను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story