బస్సును ఢీకొన్న బైక్.. క్షణాల్లో బైకర్ సజీవ దహనం
Man burnt alive with bike in bus collision.మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లా గోహ్పారు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం
By M.S.R
మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లా గోహ్పారు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం, ఒక బస్సు బైక్‌ను ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌లో మంటలు చెలరేగడంతో మోటార్‌సైకిల్‌తో పాటు యువకుడు కూడా సజీవ దహనమయ్యాడు. బస్సు బైకర్ ను ఢీకొనడం చాలా బలంగా ఉందని.. యువకుడికి రక్షించే అవకాశం లభించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటన గోహ్‌పారు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టేట్ హైవే రేవా-షహదోల్ సమీపంలో చోటు చేసుకుంది.
జబల్‌పూర్‌లోని మఝౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కకర్దేహికి చెందిన ధర్మేంద్ర బధాయి బుధవారం ఉదయం జైసింగ్‌నగర్ నుండి ఖన్నౌధీ మీదుగా షాడోల్ వైపు వస్తుండగా వేగంగా వస్తున్న దాదూ రామ్ అండ్ సన్స్ కంపెనీ బస్సు అతడి బైక్ ను ఢీకొట్టింది. ధర్మేంద్ర బైక్ రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లింది. బస్సు ఢీకొనడంతో బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడంతో బైక్ రైడర్ ధర్మేంద్ర అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. అతడిని కాపాడాలని కొందరు ప్రయత్నించగా వీలు పడలేదని తెలిపారు. క్షణాల్లో అతడు సజీవ దహనం అయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గోపారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.