కాకినాడ‌లో దారుణం.. యువ‌తి గొంతు కోసిన ప్రేమోన్మాది

Man Attacked woman refusing his love in Kakinada.త‌న‌ను ప్రేమించ‌డం లేద‌ని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగ‌ట్టాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2022 3:20 PM IST
కాకినాడ‌లో దారుణం.. యువ‌తి గొంతు కోసిన ప్రేమోన్మాది

త‌న‌ను ప్రేమించ‌డం లేద‌ని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగ‌ట్టాడు. యువ‌తిని వెంబ‌డించి గొంతు కోసి హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న కాకినాడ జిల్లాలోని కూరాడ‌-కాండ్రేగుల గ్రామాల మ‌ధ్య జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం కె.గంగ‌వ‌రం గ్రామానికి చెందిన దేవిక‌(22)ను తూర్పుగోదావ‌రి జిల్లా బిక్క‌వోలు మండ‌లం బాలాపురం గ్రామానికి చెందిన వెంక‌ట సూర్య‌నారాయ‌ణ (25) కొంత కాలంగా ప్రేమిస్తున్నాను అంటూ వెంట‌ప‌డుతున్నాడు. వీరిద్ద‌రూ కూరాడ‌లోని అమ్మ‌మ్మ‌ల ఇళ్ల ఉంటున్నారు.

ఈ విష‌యాన్ని యువ‌తి పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లింది. నెల క్రితం పంచాయ‌తీ పెట్టారు. దీంతో సూర్య‌నారాయ‌ణ‌ను బంధువులు స్వ‌గ్రామైన బాలారం తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ప‌క్కా ప్ర‌కారం బైక్‌పై కూరాడ వెలుతున్న దేవిక‌ను సూర్య‌నారాయ‌ణ కూరాడ‌-కాండ్రేగుల గ్రామాల మ‌ధ్య అడ్డ‌గించాడు. త‌న‌ను ప్రేమించాల‌ని మ‌రోసారి ఒత్తిడి చేయ‌గా.. ఇందుకు దేవిక నిరాక‌రించింది.

దీంతో త‌న‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో మెడ‌పై దాడి చేశాడు. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు నిందితుడిని ప‌ట్టుకుని చెట్టుకు క‌ట్టేసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు యువ‌తిని జీజీహెచ్‌కు తీసుకువెళ్ల‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story