18 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. యువ‌తి ప‌రిస్థితి విష‌మం

Man attacked, Girl friend, Hyderabad.నిజమైన ప్రేమ త్యాగ్యాన్ని కోరుకుటుంద‌ని అంటారు. అయితే.. తాను ప్రేమించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2021 4:37 AM GMT
18 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. యువ‌తి ప‌రిస్థితి విష‌మం

నిజమైన ప్రేమ త్యాగ్యాన్ని కోరుకుటుంద‌ని అంటారు. అయితే.. తాను ప్రేమించిన యువ‌తికి మ‌రో వ్య‌క్తితో నిశ్చితార్థం జ‌రిగింద‌ని తెలుసుకుని ఉన్మాదిగా మారాడు. యువ‌తి ద‌గ్గ‌రికి వెళ్లి క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. ప్ర‌స్తుతం బాధితురాలి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

వివ‌రాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండ‌లం చంద్ర‌క‌ల్‌కు చెందిన ఓ యువ‌తి(20)కి అదే ప్రాంతం తిమ్మారెడ్డిప‌ల్లికి చెందిన బ‌స్వ‌రాజ్‌(23)తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. వీరిద్ద‌రి పెళ్లికి యువ‌తి త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌లేదు. మూడు నెల‌ల క్రితం యువ‌తికి మ‌రో వ్య‌క్తితో నిశ్చితార్థం జ‌రిగింది. నిశ్చితార్థం అనంత‌రం యువ‌తిని హ‌స్తినాపురంలోని బాబాయి ఇంట్లో ఉంచారు. స‌న్‌సిటీ స‌మీపంలోని రామ్‌దేవ్‌గూడ‌లో ఉంటూ సెంట్రింగ్ ప‌ని చేస్తున్న బ‌స్వ‌రాజ్ ప‌థ‌కం ప్ర‌కారం బుధవారం సాయంత్రం 4.30గంట‌ల‌కు హ‌స్తినాపురంలో ఉంటున్న యువ‌తి వ‌ద్ద‌కు వ‌చ్చాడు.

యువ‌తి ఇంట్లో ఒంటరిగా ఉన్న విష‌యాన్ని నిర్థారించుకున్నాడు. ఒక్క‌సారి మాట్ల‌డితే వెళ్లిపోతానంటూ మెసేజ్ పెట్టాడు. యువ‌తి బ‌య‌ట‌కు రాగానే పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చాడు. మ‌రో వ్య‌క్తితో నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నావ‌ని ఆగ్ర‌హాంతో ఊగిపోయాడు. పెళ్లిని ఆపేస్తానంటూ.. క‌త్తితో రాక్ష‌సంగా దాడి చేసి ప‌రార‌య్యాడు. స్థానికులు యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

చేతులు, వీపు, ఛాతీ, తొడ, కడుపు భాగాల్లో మొత్తం 18 చోట్ల గాయలున్నట్లు గుర్తించిన వైద్యులు వాటిలో.. ఆరు ప్రదేశాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బాధితురాలు కోలుకునేందుకు శ్రమిస్తున్నామని.. 48 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని వైద్యులు తెలిపారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ఎల్బీన‌గ‌ర్ పోలీసులు నిందితుడు బ‌స్వ‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌డిపై హ‌త్యాయ‌త్నం కేసును న‌మోదు చేశారు.

Next Story