గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. బీటెక్ విద్యార్థిని దారుణ హ‌త్య‌

Man Attack with knife on Btech student.నేటి స‌మాజంలో మ‌హిళ‌ల‌పై ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఎన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Aug 2021 7:23 AM GMT
గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. బీటెక్ విద్యార్థిని దారుణ హ‌త్య‌

నేటి స‌మాజంలో మ‌హిళ‌ల‌పై ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి వారిపై అఘాయిత్యాలు, దారుణాలు ఆగ‌డం లేదు. ప్రేమ పేరుతో యువ‌తుల‌ను వేదించ‌డంతో పాటు వారు కాద‌న‌డంతో కొంద‌రు యువ‌కులు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. కార‌ణం ఏదైన‌ప్ప‌టికి మృగాల్లా మారుతున్నారు. తాజాగా ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు ప‌ట్ట‌ణంలోని కాకాని రోడ్డులో ఓ యువ‌తిని ఓ యువ‌కుడు క‌త్తితో పొడిచి దారుణంగా హ‌త‌మార్చాడు.

దీంతో ఆ యువ‌తి అక్క‌డిక్క‌డే మృతి చెందింది. అనంత‌రం ఆ యువ‌కుడు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. మృతి చెందిన యువ‌తి ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతున్న న‌ల్ల‌పు ర‌మ్య‌గా గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. ర‌మ్య‌ను ఆ యువ‌కుడు ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. ఇందుకు ఆ యువ‌తి ఒప్పుకోక‌పోవ‌డంతోనే ఈ దారుణానికి తెగ‌బ‌డిన‌ట్లు తెలుస్తోంది. యువ‌తి హ‌త్య‌తో గుంటూరు న‌గ‌రం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Next Story
Share it