మహిళను చంపి.. ముక్కలుగా నరికి పడేసిన వ్యక్తి అరెస్ట్

జమ్ము కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఓ మహిళను ఓ వ్యక్తి అతిక్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు.

By అంజి  Published on  12 March 2023 11:22 AM IST
Jammu Kashmir, Crimenews

మహిళను చంపి.. ముక్కలుగా నరికి పడేసిన వ్యక్తి అరెస్ట్

ఇటీవల కాలంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జమ్ము కశ్మీర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుద్గామ్‌ జిల్లాలో ఓ మహిళను ఓ వ్యక్తి అతిక్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ నేరానికి సంబంధించిన నిందితుడిని ఆదివారం నాడు అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. బుద్గాం జిల్లాలోని ఓంపోరా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల షబీర్ అహ్మద్ వని అనే వడ్రంగి.. అదే జిల్లాలోని సోయిబుగ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళను చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికినందుకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బాధితురాలి మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు.

గత నాలుగు రోజులుగా ఆ మహిళ తన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. "నిందితుడు.. మహిళను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి, రైల్వే బ్రిడ్జి ఓంపోరా, సెబ్డెన్‌తో సహా వివిధ ప్రదేశాలలో పారవేసినట్లు వెల్లడించాడు. అక్కడ బాధితురాలి తల, శరీరంలోని ఇతర భాగాలను గత రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "నిందితుడిని అరెస్టు చేశారు, అతని ఇంటి నుండి ఆమె తలతో సహా అన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని పోలీసులు తెలిపారు. అయితే మహిళను నిందితుడు హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

Next Story