ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. నమ్మించి మహిళపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారం

ఓ యువకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పరిచయమైన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానన్న నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  25 Aug 2023 6:35 AM IST
Nagpur, Instagram, Crime news

ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. నమ్మించి మహిళపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరానికి చెందిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశాడు. ఆ యువకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పరిచయమైన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానన్న నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు చేసినట్లు గురువారం ఒక అధికారి తెలిపారు. 23 ఏళ్ల మహిళ గత ఏడాది ఆగస్టులో నిందితుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్‌లో ఉందని అధికారి తెలిపారు. ఇద్దరూ తమ కాంటాక్ట్ నంబర్‌లను మార్పిడి చేసుకున్న తర్వాత, నిందితుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు మహిళకు చెప్పాడని, ఆపై ఆమెను బుటిబోరి ప్రాంతంలోని ఒక హోటల్‌కు రప్పించాడని పోలీసు అధికారి చెప్పారు.

హోటల్‌లో అతను ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని అతను చెప్పాడు. వీరిద్దరూ దాదాపు ఏడాది పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతా బాగుందనుకున్న సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని యువతి.. ఆ యువకుడిని పట్టుబట్టింది. ఆ తర్వాత నిందితుడు యువతితో పెళ్లికి నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బుధవారం బుటిబోరి నుండి నిందితుడిని పచ్‌పోలీ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం, ఇతర నేరాలకు సంబంధించిన సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Next Story