గంజాయి మత్తులో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

Man arrested for raping, murdering 3-yr-old toddler in Bengaluru. బెంగళూరులో మంగళవారం రాత్రి 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు

By అంజి  Published on  1 Feb 2023 11:26 AM IST
గంజాయి మత్తులో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

బెంగళూరులో మంగళవారం రాత్రి 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గంజాయి మత్తులో ఉండి.. ఈ పని చేశాడని చెప్పారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం దక్షిణ బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీసు పరిధిలో జరిగింది. కొన్ని గంటల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. చనిపోయిన పసిబిడ్డను ఒంటరిగా జీవిస్తున్న తల్లి సంరక్షణ చూసుకుంటోంది. నిందితుడితో ఏడాది కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ఓ గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పనికి వెళ్లేది.

గత ఏడాది కాలంగా తల్లి పనికి వెళ్లకపోవడంతో నిందితుడు పాపను చూసుకునేవాడు. అయితే, మంగళవారం రాత్రి, గంజాయి మత్తులో ఆ 26 ఏళ్ల వ్యక్తి పసిబిడ్డను లైంగికంగా వేధించి హత్య చేశాడు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 402, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేయబడింది. 26 ఏళ్ల నిందితుడిని మంగళవారం రాత్రి 7 గంటలకు అరెస్టు చేశారు. నేరం చేసినప్పుడు నిందితుడు గంజాయి మత్తులో ఉన్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

దక్షిణ బెంగళూరులోని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ''నేరం జరిగిన స్థలం నందగోకుల్ ప్రభుత్వ పాఠశాల, కావేరీ నగర్, కామస్క్షిపాల్య సమీపంలో ఉంది. నిందితుడికి 26 ఏళ్లు, రాత్రి 7 గంటలకు అరెస్టు చేశారు. అతను బాధితురాలికి తెలుసు'' అని చెప్పారు.

Next Story