5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. 5 గుంజీల శిక్ష‌

Man accused of molestation in Patna let off with 5 sit ups by local panchayat.ఓ ఐదేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2022 4:43 AM GMT
5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. 5 గుంజీల శిక్ష‌

ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారి నుంచి పండు ముస‌లి వాళ్ల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు కామాంధులు. ఓ ఐదేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీనిపై చిన్నారి త‌ల్లిదండ్రులు పంచాయ‌తీ పెట్ట‌గా.. న్యాయ‌న్ని అవ‌హేళ‌న చేసేలా నిందితుడికి 5 గుంజీలు తీయాల‌నే శిక్షను విధించారు పంచాయ‌తీ పెద్ద‌లు. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌వాదా జిల్లాలోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్య‌క్తి కోళ్ల‌ఫారంలో పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక‌కు చాక్లెట్లు ఇస్తాన‌ని ఆశ చూపి బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని బాలిక త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బ‌య‌లుదేర‌గా.. కోళ్ల ఫారం య‌జ‌మాని జోక్యం చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని పంచాయ‌తీలో తేల్చుకోవాల‌ని సూచించాడు.

పంచాయ‌తీ పెద్ద‌లు నిందితుడికి ఐదు గుంజీల శిక్ష‌ను విధించారు. గ్రామంలోని అందిరి ముంద‌ర ఐదు గుంజీలు అత‌డి చేత తీయించి వ‌దిలివేశారు. కాగా.. దీనిపై గ్రామ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పంచాయ‌తీ పెద్ద‌లపై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it