Malla reddy college student suspicious death in medchal district. మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకు చెందిన చంద్రిక అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకు చెందిన చంద్రిక అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చంద్రిక స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. మల్లారెడ్డి కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక మంగళవారం శవమై కనిపించింది. ఆమె కళాశాల సమీపంలో ఉన్న కృఫా వసతి గృహంలో ఉంటోంది. వసతి గృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో చంద్రిక మృతదేహాం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని మంగళవారం ఉదయం కొందరు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్‌తో అక్కడిచేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు.
చంద్రిక వసతి గృహం భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఇంజినీరింగ్ ద్వితియ, తృతీయ సబ్జెక్టుల్లో చంద్రికకు బ్యాక్స్ లాగ్స్ ఉన్నాయని.. ప్రస్తుతం పైనల్ ఇయర్ పరీక్షలు దగ్గరపడడంతో పాస్ అవుతానో కానో అనే ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని బావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. చంద్రిక భవనంపై దూకిన దృశ్యాలు కనిపించాయి. వసతి గృహం నిర్వాహకులను, విద్యార్థులను పోలీసులు ఆరా తీశారు