యువతిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు రోషన్ ఉల్లాస్ అరెస్ట్ అయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నటుడు రోషన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు త్రిస్సూర్‌కు చెందిన యువతి కలమస్సేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది.
ఫిర్యాదుదారురాలు ప్రకారం.. 2022లో త్రిస్సూర్, కోయంబత్తూరులో తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా తనను కోయంబత్తూరుకు తీసుకెళ్లి.. తనపై రోషన్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం రోషన్ రిమాండ్‌లో ఉన్నాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒట్టవాన్, నాయికా నాయకన్ వంటి సినిమాల్లో రోషన్ నటించారు. పలు సీరియల్స్‌లో కూడా రోషన్ నటించాడు.