ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
Major Road Accident in Bahadurgarh.హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన
By తోట వంశీ కుమార్ Published on
22 Oct 2021 7:05 AM GMT

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. జాజర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానాలోని జజ్జర్‌లో బద్లి పట్టణం సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్కు కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణీస్తున్న 8 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారు నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story