అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి
బుధవారం ఉదయం ముంబైలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 Oct 2024 11:56 AM ISTఅపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి
బుధవారం ఉదయం ముంబైలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని 14 అంతస్తుల నివాస భవనంలో బుధవారం ఉదయం 8 గంటలకు 'లెవల్ వన్' అగ్నిప్రమాదం ప్రారంభమైంది.
ముంబై అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని 4వ క్రాస్ రోడ్‌లో ఉన్న రియా ప్యాలెస్ భవనంలోని 10వ అంతస్తులోని ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, వారిని కూపర్ ఆసుపత్రికి తరలించగా, వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని అధికారులు తెలిపారు.
ఉదయం 8.55 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు, ఈ ఘటనలో మరణించిన వారిని చంద్రప్రకాష్ సోని (74), కాంత సోని (74), పెలుబేట (42)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నెల ప్రారంభంలో, ముంబైలోని చెంబూర్‌లోని రెండంతస్తుల దుకాణం,నివాస నిర్మాణంలో మంటలు చెలరేగడంతో ఏడేళ్ల బాలికతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. షాపుగా ఉపయోగించే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో 'లెవల్ వన్' మంటలు చెలరేగగా, పై అంతస్తు నివాసంగా ఉంది. షాపులోని ఎలక్ట్రిక్ వైరింగ్, ఇన్‌స్టాలేషన్‌లకు మంటలు అంటుకుని పై అంతస్తుకు వ్యాపించాయని అధికారులు తెలిపారు.