గర్భం దాల్చేందుకు.. భార్యకు మానవ అస్థికల బూడిద తినిపించిన భర్త

Maharashtra Woman forced to consume human ashes in witchcraft ritual. మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన వెలుగు చూసింది. గర్భం దాల్చి ఇంటికి శ్రేయస్సు

By అంజి  Published on  20 Jan 2023 3:29 PM IST
గర్భం దాల్చేందుకు.. భార్యకు మానవ అస్థికల బూడిద తినిపించిన భర్త

మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన వెలుగు చూసింది. గర్భం దాల్చి ఇంటికి శ్రేయస్సు తీసుకురావాలని బలవంతంగా భార్యకు బలవంతంగా మానవ అస్థికల బూడిద తినిపించారు. దీనిపై 28 ఏళ్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై చేతబడి చేయిస్తున్నారని ఆరోపిస్తూ తన భర్త, అత్తమామలతో సహా 8 మందిపై సింహగడ్ పోలీసులు గురువారం సదరు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన పూణెలోని ధైరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయంపై ప్రాథమిక విచారణలో మహిళను గత మూడేళ్లుగా ఆమె కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తేలింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు చాలా కాలంగా కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులు తెలిపారు. పెళ్లయిన చాలా నెలల తర్వాత ఆ మహిళ బిడ్డను కనకపోవడంతో వేధింపులు తీవ్రమయ్యాయి.

కుటుంబ సభ్యులు.. బాధితురాలిపై చేతబడి చేయించారు. మానవ, జంతు బలితో మహిళపై అఘోరి పూజలు చేయడం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం కుటుంబసభ్యులు కూడా ఇదే తరహాలో పూజలు చేశారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రతువులో మేకలు, కోళ్లను బలి ఇస్తారని ఆమె తెలిపారు. ఈ కర్మ ముగింపులో.. బాధితురాలు మనిషి మృతదేహాన్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను తినవలసి వచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక సింహగఢ్ పోలీసులను ఆశ్రయించింది.

Next Story