టీచర్, విద్యార్థులు వేధిస్తున్నారని.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్

స్కూల్‌లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు వేధిస్తున్నారని ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2024 9:00 AM IST
Maharashtra, 13 years boy, suicide,  teacher, classmates,

టీచర్, విద్యార్థులు వేధిస్తున్నారని.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్‌లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు వేధిస్తున్నారని ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విద్యార్థి కుటుంబంలో విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ విషాద సంఘటన.

కల్యాణ్‌ ఈస్ట్ ప్రాంతంలోని ఓ ప్రముఖ పాఠశాలలో 13 ఏళ్ల బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. అయితే.. ఇంట్లో నుంచి పేరెంట్స్‌ బయటకు వెళ్లే సమయం కోసం వేచి చూసి.. ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ఉపాధ్యాయుడు, కొందరు తోటి విద్యార్థులు తనని వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు బాబు చనిపోవడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులుఅక్కడికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. ఆ బాలుడు రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎందుకు ఉపాద్యాయుడు వేధించాడు..? తోటి విద్యార్థులు ఎలా మెలిగేవారు ..? సహా సూసైడ్‌కు గల పూర్తి కారణాలను తెలుసుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Next Story