హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఓ కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లింది.
By అంజి Published on 4 July 2023 2:37 PM IST
హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఓ కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లడంతో పది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ట్రక్కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో దాని డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయాడు. వెనుకవైపు నుంచి రెండు మోటార్‌సైకిళ్లు, కారు, మరో కంటైనర్‌ను ట్రక్కు ఢీకొట్టింది.
VIDEO | At least 15 people reportedly killed in an accident involving a truck and several vehicles on the Mumbai-Agra Highway in Dhule, Maharashtra. pic.twitter.com/49JmnBSUJs
— Press Trust of India (@PTI_News) July 4, 2023
ట్రక్కు హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. "కనీసం 10 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు" అని అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి ధులే వైపు ట్రక్కు వెళ్తోంది. అయితే ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించినట్లు తాజా పీటీఐ నివేదికలు సూచిస్తున్నాయి. బాధితుల్లో స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న వారిలో కొందరు ఉన్నారని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను శిర్పూర్, ధూలేలోని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.