Mahabubabad: 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. తండ్రి ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని..

నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామంలో జరిగింది.

By అంజి  Published on  31 May 2024 2:00 PM IST
Mahabubabad, stylish haircut, Suicide, Crime

ప్రతీకాత్మక చిత్రం

నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు సీతానాగ్రామ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఇ.హర్ష వర్ధన్‌గా గుర్తించారు. తన వేసవి సెలవుల్లో, హర్ష వర్ధన్ ఫ్యాషన్‌లో ఉన్న ఒక నిర్దిష్ట హెయిర్‌స్టైల్‌ను చేసుకోవాలనుకున్నాడు. అయితే, రైతు అయిన అతని తండ్రి కాంతారావు అందుకు అనుమతించలేదు.

తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలుడు మే 26న పురుగుమందు తాగాడు. హర్షవర్ధన్‌ను వెంటనే గంగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యసేవలందించినప్పటికీ నాలుగు రోజుల పాటు ప్రాణాలతో పోరాడుతూ గురువారం బాలుడు మృతి చెందాడు. గంగారం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ బి.రవి మీడియాతో మాట్లాడుతూ.. సిఆర్‌పిసి సెక్షన్‌ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

Next Story