పోర్న్ వీడియో చూసి 9ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. విచారణలో మరిన్ని సంచలనాలు
మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. రే
By Srikanth Gundamalla Published on 28 July 2024 9:30 AM ISTపోర్న్ వీడియో చూసి 9ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. విచారణలో మరిన్ని సంచలనాలు
మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. రేవాలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. మొబైల్ ఫోన్‌లో పోర్న్ చూసి తొమ్మిదేళ్ల చెల్లిపై ఆమె సోదరుడు (13 ఏళ్లు) లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఏప్రిల్ 24న జరిగిన దారుణ ఘటన జరిగింది. అయితే..బాలుడిని కాపాడేందుకు. ఈ దారుణాన్ని తల్లి, ఇద్దరు అక్కలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని పోలీసుల విచారణలో తెలిసింది.
జావా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 24న ఈ ఘటన జరిగిందని ఎస్పీ వివేక్‌సింగ్ తెలిపారు. రాత్రి సమయంలో బాలుడు.. తన చెల్లి పక్కనే పడుకున్నాడనీ తెలిపారు. ఆ సమయంలో మొబైల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసి.. బాలికపై అత్యాచారం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. తమ తండ్రికి ఫిర్యాదు చేస్తానని బాలిక బెదిరించడంతో.. బాలుడు ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తల్లిని నిద్రలేపి విషయాన్ని తెలిపాడు. తన కూతురు బతికే ఉందని గుర్తించిన బాలుడు మళ్లీ గొంతు నులిమి చంపేసింది. అప్పటికి మేల్కొన్న బాలుడి ఇద్దరు అక్కలు కూడా దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు బెడ్‌పై మచ్చలు మార్చారని ఎస్పీ చెప్పారు. బాలుడి అక్కల్లో ఒకరు పదిహేడు, 18 ఏళ్ల వయసు ఉన్నవారని తెలిపారు. బాలుడిని, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు బాలికను విషపురుగు కరిచిందనీ.. దాంతో చనిపోయిందని చెప్పారు. మృతదేహాన్ని ప్రయివేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. కానీ వారు నిరాకరించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే అత్యాచారం, హత్య మరణానికి కారణమని వైద్యులు తెలిపారు. విచారణలో భాగంగా కుటుంబ సభ్యులు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.