కీచక టీచర్ : 12 ఏళ్ల బాలికపై అత్యాచారం
Madarsa teacher molested 12 year old girl in Agra.మదర్సాలో చదువుతున్న 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2022 5:17 PM ISTNext Story
మదర్సాలో చదువుతున్న 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆగ్రా పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఆగ్రా జిల్లాలోని మల్పురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితులపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సత్యజీత్ గుప్తా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు బాధితురాలిపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. నిందితుడు మే 25న బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయాన్ని బాధితురాలు తన కుటుంబానికి చెప్పడంతో బాధితురాలి కుటుంబం నిందితుడి కుటుంబీకులతో గొడవ పడ్డారు. నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలి కుటుంబం ఈ విషయం బయటకు చెప్పకుండా బెదిరించడం ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. మరో మార్గం లేకపోవడంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దోషులుగా తేలిన వారిని వదిలిపెట్టబోమని పోలీసులు తెలిపారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టంలోని సెక్షన్ 5 ఎఫ్, 6 సెక్షన్ 376 (అత్యాచారం), 506 ఐపిసి సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం ఆగ్రాలోని బాలల సంక్షేమ కమిటీకి, UP రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు నివేదించబడింది.