మీర్‌పేటలో దారుణం.. వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం
Madannapeta police constable Moslated a woman.ఓ కానిస్టేబుల్ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 17 Nov 2022 11:46 AM ISTఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారు. ఓ కానిస్టేబుల్ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్నచిత్రాలు సేకరించి తనపై ఉన్న పాత కేసును ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లోనూ దుమారం రేపుతోంది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కామాంధుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మీర్‌పేట్ పరిధిలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. వీరి నివాసానికి సమీపంలోనే బాధిత మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఈక్రమంలో కానిస్టేబుల్ భార్యకు, బాధితురాలికి మంచి స్నేహం కుదిరింది. వెంకటేశ్వర్లు కన్ను ఆ వివాహితపై పడింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని ఆమె తిరస్కడంతో మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు.
దీంతో బాధితురాలు 2021లో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు. అయినప్పటికీ అతడి వేదింపులు కొనసాగడంతో మరోసారి బాధితురాలు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మే నెలలో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడు జైలులో ఉండగా వివాహిత.. తన కుటుంబంతో కలిసి మీర్‌పేట్‌కు మకాం మార్చింది.
జైలు నుంచి విడుదలైన వెంకటేశ్వర్లు ఆమె పై కక్ష గట్టాడు. ఆమె అడ్రస్ తెలుసుకుని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు సేకరించి ఎవరికి చెప్పవద్దంటూ బెదిరించేవాడు. ఆ తరువాత తరచుగా ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. నవంబర్ 14న మరోసారి నిందితుడు ఆమె ఇంటికి వెళ్లి గతంలో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. ఆమె వినకపోవడంతో దాడికి దిగాడు. మరోసారి అత్యాచారం చేసేందుకు యత్నించగా బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాధితురాలు మీర్‌పేట్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.